పారితోషికం విషయంలో తగ్గని నభా నటేశ్
- గ్లామరస్ హీరోయిన్ గా నభా నటేశ్
- యూత్ లో మంచి క్రేజ్
- పారితోషికం ఎక్కువంటూ టాక్
నభా నటేశ్ కి గల క్రేజ్ కారణంగా, ఆమెకు వరుస అవకాశాలు వెళుతూనే వున్నాయట. అయితే అమ్మడు అడిగే పారితోషికం ఒక రేంజ్ లో ఉందట. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఆమె పారితోషికం వుండటంతో, అంతటి సాహసం చేయలేక దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఆమెకి బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదిస్తున్నారని సమాచారం. పారితోషికం తగ్గించుకోకపోతే కష్టమేననే విషయాన్ని ఆమెకి సన్నిహితులు కూడా చెబుతున్నారట. ఇందులో వాస్తవమెంతోగానీ, ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.