Sikhar Dhawan: గృహహింస వద్దు.. ప్రేమతో ఉండండి: శిఖర్ ధావన్

Let us stop domestic violence says Sikhar Dhawan

  • కుటుంబంతో సంతోషంగా ఉన్నా
  • ఈరోజుల్లో కూడా కొందరు గృహహింసకు పాల్పడుతున్నారు
  • గృహహింసను అంతమొందించండి

మహిళలపై జరుగుతున్న గృహహింసను అంతమొందించాలని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కోరాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక సందేశాత్మక వీడియోను పోస్ట్ చేశాడు. లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి ఎంతో సంతోషకర సమయాన్ని గడుపుతున్నానని చెప్పాడు.

అయితే, ఈ రోజుల్లో కూడా కొందరు గృహహింసకు పాల్పడుతున్నారని... వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపాడు. హింసకు దూరంగా ఉండాలని... జీవిత భాగస్వామితో ప్రేమతో గడపాలని సూచించాడు. 47 సెకండ్ల వీడియోలో బాక్సింగ్ పంచులను ప్రాక్టీస్ చేస్తూ... తన భార్య, కుమారుడితో పంచులు ప్రాక్టీస్ చేయించడం వంటివి ఉన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News