Corona Virus: కరోనా నుంచి కోలుకున్న వారిపై వివక్ష వద్దు: కేంద్రం

 Dont discriminate against those recovered from corona urges Center

  • వారి నుంచి ఇతరులకు వైరస్ సోకదు
  • వాళ్ల ప్లాస్మాతో  కరోనా రోగులకు చికిత్స చేయొచ్చు
  • దేశ వ్యాప్తంగా 6184 మంది కోలుకున్నారు

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా బారిన పడి  కోలుకున్న వారిపై వివక్ష చూపొద్దని, వారిని దూరంగా ఉంచొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి నుంచి ఈ వైరస్‌ ఇతరులకు సోకదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారి నుంచి సేకరించే ప్లాస్మా ద్వారా మరింత మంది కరోనా రోగులకు ‘ప్లాస్మా థెరపీ’ చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపింది.

 దేశ వ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటిదాకా 6184 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో  కోలుకున్న వారి శాతం 22.17గా  ఉందని చెప్పింది.  కాగా, ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 1396  కొత్త కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. దీంతో, మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 27,892కి పెరిగింది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటిదాకా 872 మంది మరణించారు. గతంలో పాజిటివ్‌ కేసులున్న 16 జిల్లాల్లో గడచిన 28 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది.

  • Loading...

More Telugu News