Samantha: నేడు సమంత పుట్టిన రోజు... స్వయంగా కేక్ తయారు చేసి సర్ ప్రయిజ్ ఇచ్చిన చైతూ!

Naga Chaitanya Makes Birth day Cake for Samanta

  • వంట గదిలో గరిట తిప్పిన నాగ చైతన్య
  • చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేసిన సమంత
  • విషెస్ చెబుతున్న పలువురు ప్రముఖులు

కేవలం గ్లామర్ పాత్రలనే కాకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రలను ధరిస్తూ, లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుని వెళుతున్న అక్కినేని సమంత పుట్టిన రోజు నేడు. పెళ్లి తరువాత కూడా నటనను కొనసాగిస్తున్న ఆమె, పలువురు హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచిందనడంలో సందేహం లేదు.

ఇక లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సమంత, ఆమె భర్త నాగ చైతన్య ఇంటికే పరిమితం కాగా, పుట్టిన రోజు వేడుకలు సైతం నిరాడంబరంగా సాగాయి. తన భార్య కోసం స్వయంగా చైతూ వంటగదిలోకి వెళ్లి గరిట పట్టాడు. బర్త్ డే కేక్ ను తయారు చేశాడు. ఆపై సమంత దాన్ని కట్ చేసి, భర్తకు తినిపించింది.

ఈ వీడియోను, చిత్రాలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. "కుటుంబం ప్రేమ... నేను దేని కోసం ప్రార్థిస్తున్నానో మీరు ఊహించలేరు" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక పలువురు స్టార్ హీరో, హీరోయిన్లు, ప్రముఖులు సమంతకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News