Corona Virus: ఇవి కూడా కరోనా లక్షణాలే కావొచ్చు... మరో ఆరింటిని జాబితాలో చేర్చిన సీడీసీ

CDC tells six more symptoms could be corona

  • జలుబు, జ్వరం, దగ్గు ప్రధానలక్షణాలుగా గుర్తింపు
  • గొంతునొప్పి, చలి, కళ్ల మంటలతో జాగ్రత్తగా ఉండాలంటున్న సీడీసీ
  • కండరాల నొప్పులు కరోనా సంకేతాలు కావొచ్చని వివరణ

దేశంలో గత కొన్నివారాలుగా నిత్యం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  కరోనా లక్షణాలు అంటే ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం అని భావిస్తూ వచ్చారు. అయితే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా మరో 6 అంశాలను కూడా కరోనా లక్షణాల జాబితాలో చేర్చింది.
  • రుచిని గుర్తించలేకపోవడం, వాసన చూసే శక్తి సన్నగిల్లడం.
  • చలి, వణుకు
  • కండరాల నొప్పులు
  • తలనొప్పి
  • కళ్లు ఎర్రబారడం
  • గొంతు నొప్పి
ఈ లక్షణాలు ఉన్నా కరోనాగా అనుమానించాల్సి ఉంటుందని సీడీసీ పేర్కొంది. ముఖ్యంగా, 60 శాతం కరోనా కేసుల్లో పొడిదగ్గుతో పాటు గొంతు నొప్పి కూడా కనిపించిందని వివరించింది. కణత, కనురెప్పలు సైతం నొప్పిగా ఉండడం కరోనా లక్షణమేనని తెలిపింది.

  • Loading...

More Telugu News