Chiranjeevi: కారణం రేపు చెబుతానంటూ.. చిరూ నుంచి ఆసక్తికరమైన ట్వీట్

Acharya Movie

  • చిరంజీవి తాజా చిత్రంగా 'ఆచార్య'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • ఓ పాట బాగా ఎంజాయ్ చేస్తున్నారట

చిరంజీవి తన తాజా చిత్రంగా 'ఆచార్య' చేస్తున్నారు. బలమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమా కొరటాల దర్శకత్వంలో రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగ్, ఆ తరువాత కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

"సాధారణంగా నా సినిమాలకి సంబంధించిన పాటలను వాటి చిత్రీకరణ సమయంలో పూర్తిగా వింటూ ఆనందిస్తాను. మధ్యలో పాజ్ చేయడానికి నేను ఇష్టపడను. కానీ ఇటీవల ఒక పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ .. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. అందుకు  కారణం ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను" అని చెప్పుకొచ్చారు. చిరంజీవి చెప్పే ఆ పాట 'ఆచార్య' సినిమాకి సంబంధించినది అయ్యుంటుంది. ఆ పాట గురించి చిరంజీవి ఏం చెబుతారోననేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Chiranjeevi
Koratala Siva
Acharya Movie
Manisharma
  • Error fetching data: Network response was not ok

More Telugu News