rain: ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
- కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో పడిపోయిన సెల్‌టవర్
- తూ.గో జిల్లా పి.గన్నవరంలో ఉరుములు, మెరుపులతో వర్షం
- నేలకు ఒరిగిన వరిచేలు
- ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ఓ సెల్‌టవర్ పడిపోయింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. గాలివాన కారణంగా వరిచేలు నేలకు ఒరిగిపోయాయి.
అమరావతి, సత్తెనపల్లి, పెదకూరపాడు, మేడికొండూరు, కొల్లిపర, రొంపిచర్ల, బాపట్ల, విజయవాడ రూరల్, ఉంగుటూరు, జగ్గయ్యపేటలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ కూడా సూచనలు చేసింది. అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున పంట నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.