YV Subba Reddy: కలియుగదైవం ఆ పరిస్థితి రానీయడని భావిస్తున్నా: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy press meet

  • టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లు బయటకు తీసే ప్రసక్తే  లేదు
  • ఆ పరిస్థితి రాకుండా చర్యలు కూడా తీసుకుంటాం
  • సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నా

లాక్ డౌన్ ప్రభావం టీటీడీ ఆదాయంపైన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లను బయటకు తీయాల్సి వస్తుందంటూ వస్తున్న వార్తలపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు అటువంటి పరిస్థితి రానీయడని తాను భావిస్తున్నానని అన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

‘కరోనా’ మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడి సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు లేని వలస కార్మికులకు, నిరాశ్రయులకు, యాచకులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా రోజూ రెండు పూట్ల భోజనం పెడుతున్నామని, సుమారు 65 నుంచి 70 వేల మందికి అన్నప్రసాదం అందజేశామని అన్నారు.

YV Subba Reddy
TTD
Corona Virus
Lockdown
  • Loading...

More Telugu News