Kala Venkatrao: తమిళనాడులో చిక్కుకున్న ప్రకాశం జిల్లా కూలీల కోసం సీఎం జగన్ కు లేఖ రాసిన కళా వెంకట్రావు

AP TDP Chief Kala Venktrao writes to CM Jagan

  • తమిళనాడులో నిలిచిపోయిన 300 మంది కూలీలు
  • ఆహారం, వసతి లేక ఇబ్బంది పడుతున్నారన్న కళా
  • వారిని రాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తమిళనాడులో చిక్కుకున్న కూలీలను రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన 300 మంది కూలీలు లాక్ డౌన్ కారణంగా తమిళనాడులో చిక్కుకుపోయారని, ఆహారం, వసతి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి వారికి వెంటనే భోజనం, వసతి కల్పించేలా చూడాలని, వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Kala Venkatrao
Jagan
Andhra Pradesh
Tamilnadu
Prakasam District
Workers
Lockdown
Corona Virus
  • Loading...

More Telugu News