Jagan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం జగన్ ఫోన్

CM Jagan talks to Union Minister Nirmala Sitharaman
  • గుజరాత్ లో లాక్ డౌన్ అమలు
  • అక్కడే చిక్కుకుపోయిన వేలమంది ఏపీ మత్స్యకారులు
  • మత్స్యకారుల బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగింత
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు గుజరాత్ లోనూ లాక్ డౌన్ విధించడంతో ఏపీకి చెందిన వేలమంది మత్స్యకారులు అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. తమను ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఇటీవలే వారు ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు.

దీనిపై స్పందించిన సీఎం జగన్ గుజరాత్ నుంచి ఏపీ మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫోన్ చేశారు. ఏపీకి చెందిన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో గుజరాత్ లో చిక్కుకుపోయారని, వారిని ఆదుకునేందుకు సాయపడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు మత్స్యకారుల బాధ్యతలు అప్పగించారు.
Jagan
Nirmala Sitharaman
Phone
AP Fishermen
Gujarath
Lockdown
Corona Virus

More Telugu News