Currency Notes: కరెన్సీ నోట్లపై వైరస్ ను తరిమేసేందుకు... కృష్ణా జిల్లాలో వినూత్న ప్రయోగం!

Master Plan of a Shop Owner for Curency Sanitise
  • నోట్లను అంటుకుని ఉండే కరోనా వైరస్
  • నోట్లను శానిటైజ్ చేయాలన్న ఆలోచనకు వచ్చిన యజమాని
  • కుక్కర్ లో నీటి ఆవిరి వినియోగించి ప్రయోగం
కరెన్సీ నోట్లను అంటుకుని ఉండే కరోనా వైరస్ ను తరిమేసేందుకు కృష్ణా జిల్లా కైకలూరులో ఉన్న ఓ జనరల్ స్టోర్ యజమాని వినూత్న ప్లాన్ వేశారు. పట్టణంలోని కొత్త నరసింహరావు, విజయలక్ష్మీ జనరల్ స్టోర్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చే కరెన్సీ నోట్లను శానిటైజ్ చేసి వినియోగించుకోవాలని భావించిన ఆయన, వాటిని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో నీటి ఆవిరితో ఉడికించాలన్న ఆలోచనకు వచ్చారు.

తొలుత నేరుగా కుక్కర్ లో నోట్లను వేడిచేయగా, అవి కాలిపోయాయి. ఆపై మరింతగా తన మెదడుకు పదును పెట్టిన ఆయన, కుక్కర్ లో కాసిన్ని నీళ్లు పోసి, మధ్యలో రంద్రాలు ఉన్న ప్లేటును అమర్చారు. దీంతో ఆయన ప్రయోగం ఫలించింది. నీటి ఆవిరిలో నోట్లన్నీ ఉడికి పోయాయి. ఈ విధంగా చేయడంతో అధిక వేడిమితో కూడిన ఆవిరి వల్ల నోట్లపై ఉన్న క్రిములు చనిపోతాయని నరసింహారావు వెల్లడించారు.
Currency Notes
Corona Virus
Electric Cooker

More Telugu News