Varla Ramaiah: పెద్ద 'ట్విట్టర్ వీరుడు' విజయసాయి: వర్ల రామయ్య సెటైర్

Varla Ramaiah Comments on Vijayasai Reddy
  • కరోనా విషయంలో నిత్యమూ అవాస్తవాలు
  • విజయసాయి చెప్పేది ఏదీ నమ్మేలా లేదు
  • ట్విట్టర్ ఖాతాలో వర్ల రామయ్య విమర్శలు
కరోనా మహమ్మారి విషయంలో నిత్యమూ అబద్ధాలు చెబుతూ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఓ కమేడియన్ గా మారిపోయారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "విజయసాయిరెడ్డీ గారు పెద్ద "ట్విట్టర్ వీరుడు".ఆయన ట్వీట్లు అన్నీ అబద్దాలే. నమ్మశక్యం కానివి. లేకపోతే, రాష్ట్రంలో కరొనా విపరీతంగా పెరిగిపోతున్నదని అందోళన చెందుతుంటే, మన రాష్ట్రంలో కరొనా కట్టడి బాగాచేసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించినట్లు బాక ఊదుతారు. ఈ ప్రభుత్వానికీ పెద్ద విదూషకుడీయన" అని వ్యాఖ్యానించారు.
Varla Ramaiah
Vijayasai Reddy
Twitter

More Telugu News