India: ఇండియాలోని 20 శాతం కరోనా కేసులు ఒక్క ముంబయి మహానగరంలోనే!

Over 5000 Cases in Mumbai

  • దేశవ్యాప్తంగా 25 వేలు దాటేసిన కేసులు
  • మహారాష్ట్రలో శనివారం 811 కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య 7,628

ఇండియాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 25 వేలను దాటేసిన వేళ, అందులో 20 శాతం కేసులు... అంటే 5 వేలకు పైగా కేసులు ఒక్క ముంబయి మహానగరంలోనే నమోదు కావడం అధికారులను కలవరపెడుతోంది. శనివారం నాడు మహారాష్ట్రలో కొత్తగా 811 కేసులు నమోదుకావడంతో, రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,628కి చేరింది. కొత్త కేసుల్లో 602 ముంబైలోనివే కావడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 21 కేసులు వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 323 కాగా, ముంబైలో 191 మంది మరణించారు.

కరోనా వైరస్ సోకి 57 సంవత్సరాల హెడ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ గణపత్ పెందూర్కర్ మరణించారని ముంబై పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం నాడు పుణెలో నలుగురు కరోనా కారణంగా మరణించారు. పుణెలో ఒకరు పింప్రి-చించావాడ్, ధూలే, సోలాపూర్ ప్రాంతాల్లో ఒక్కొక్కరూ మరణించారు. కొత్త మరణాల్లో 59 శాతం రోగులు మధుమేహం, బీపీ, ఆస్తమాలతో పాటు గుండె జబ్బులతో బాధపడుతున్నవారేనని అన్నారు. ఇంతవరకూ రాష్ట్రంలో కరోనా సోకి 1,076 మంది రికవరీ అయి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక మరణాల సంఖ్యను తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది వైద్య నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను నియమించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో హై రిస్క్ ఉన్న వారిని గుర్తించి, వారికి చికిత్సలపై సలహా, సూచనలు అందించడం, తాజా నివేదికలను ప్రభుత్వానికి అందించడం వీరి పని. 

  • Loading...

More Telugu News