Delhi: కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినా.. ఢిల్లీలో తెరుచుకోని షాపులు!

Shops in Delhi still closed

  • నివాస ప్రాంతాల్లో దుకాణాలు తెరవచ్చని కేంద్రం ఉత్తర్వులు
  • ఢిల్లీలో ఇంకా ప్రారంభం కాని ట్రాన్స్ పోర్టేషన్
  • దుకాణాలకు రాలేకపోతున్న ఉద్యోగులు

నివాస ప్రాంతాల్లో షాపులు తెరిచేందుకు వీలుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మాస్కులు, గ్లవ్స్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి చేయాలని షరతు విధించింది. దీంతో ఢిల్లీ ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఢిల్లీలో ఇంతవరకు షాపులు తెరుచుకోలేదు. ట్రాన్స్ పోర్టేషన్ ఇంకా పునఃప్రారంభం కాకపోవడంతో... షాపుల్లో పని చేసేవారు రాలేకపోతున్నారు. దీంతో, షాపులు తెరుచుకోలేదు.

మరోవైపు మాల్స్, హెయిర్ సెలూన్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులు, జిమ్ లు, స్మిమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులను తెరవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడే ఆంక్షలను సడలించలేమని స్పష్టం చేశారు. పరిస్థితిపై ఇంకా చర్చలు జరుపుతున్నామని... ఏ నిర్ణయం తీసుకున్నా ఏప్రిల్ 30వ తేదీ తర్వాతే అమలు చేస్తామని చెప్పారు.

Delhi
Shops
open
Central Government
Lockdown
  • Loading...

More Telugu News