Kishan Reddy: కరోనా కేసుల్లో 60 శాతం ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారివే ఉన్నాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

60 percent of  corona cases due to markaj says Kishan Reddy

  • మర్కజ్ నుంచి వచ్చిన వారు అనేక ప్రాంతాలకు వెళ్లారు
  • దేశంలో ఇతర ఎమర్జెన్సీ కేసులు తగ్గిపోయాయి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పని చేస్తున్నాయి

మన దేశంలోని కొన్ని నగరాలు, పట్టణాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని... మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారే దీనికి కారణమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రార్థనలకు వెళ్లినవారు తెలంగాణతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు. దేశంలోని కరోనా కేసుల్లో అరవై శాతం మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారివేనని మంత్రి చెప్పారు.

మరోవైపు ఇతర ఎమర్జెన్సీ కేసులు తగ్గిపోయాయని... ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని చెప్పారు. ఎవరికైనా ఏదైనా ఇతర జబ్బు వస్తే ఎక్కడకు వెళ్లాలో కూడా అర్థంకాని అయోమయం ప్రజల్లో నెలకొందని అన్నారు. ఆరోగ్యసేతు యాప్ లో వివరాలను పొందుపరిస్తే... రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారని కిషన్ రెడ్డి చెప్పారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవకులు ఉన్నారని, అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారని... ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వీరికి ఫోన్ చేసి వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కు సహకరించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కోవడానికి అంకిత భావంతో పని చేస్తున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News