Pavan Kalyan: వీలైతే సంక్రాంతికి .. లేదంటే రిపబ్లిక్ డేకి 'వకీల్ సాబ్'!

Vakeel Saab Movie

  • పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రధారిగా 'వకీల్ సాబ్'
  • లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • వచ్చే ఏడాదిలోనే విడుదల

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'దిల్' రాజు నిర్మాణంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు, లాక్ డౌన్ ఎత్తేయగానే మొదలుకానుంది. హిందీలో విజయవంతమైన 'పింక్' సినిమాకి ఇది రీమేక్.

ఇక లాక్ డౌన్ తీసేసినప్పటికీ జనంలో భయంపోయి మునుపటిలా థియేటర్స్ కి రావడానికి  చాలా సమయమే పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువలన 'వకీల్ సాబ్' షూటింగు పూర్తయినప్పటికీ, నిర్మాత 'దిల్' రాజు ఇప్పట్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన చేయడం లేదట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఆ సమయంలో పెద్ద సినిమాలు రంగంలో వుంటే, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెబుతున్నారు.

Pavan Kalyan
Venu Sriram
Dil Raju
  • Loading...

More Telugu News