Lockdown: లాక్‌డౌన్‌లో సాయం చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పేరును తన కుమారుడికి పెట్టిన తల్లి.. వీడియో ఇదిగో

Mother names newborn after Delhi cop who rushed her to hospital amid lockdown

  • అంబులెన్సు కోసం కొన్ని గంటలు ఎదురు చూసినా రాని వైనం
  • చివరకు పోలీసులకు ఫోన్‌ చేసిన మహిళ
  • వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్
  • పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన మహిళ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాన్పు కోసం తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ పేరును ఓ మహిళ తన కుమారుడికి పెట్టింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను కాపాడిన పోలీసుకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొంది.

ఢిల్లీలో పురిటి నొప్పులు పడుతున్న అనుప అనే మహిళను గుర్తించిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్ వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో ఆమెకు సాధారణ కాన్పు జరిగి, పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో తనను కాపాడిన దయావీర్ సింగ్ పేరును తన బాబుకి పెట్టినట్లు ఆమె మీడియాకు తెలిపింది.  

తాను ఇంటి వద్ద అంబులెన్సు కోసం గంటల కొద్దీ ఎదురు చూశానని, ఏ వాహన సదుపాయం దొరకలేదని అనుప చెప్పింది. చివరకు పోలీసులకు ఫోన్‌ చేయడంతో సమయానికి వచ్చి తనను దయావీర్‌ సింగ్ ఆసుపత్రికి  తీసుకెళ్లాడని తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన దయావీర్‌ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... బాబుకు తన పేరు పెట్టడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోనూ ఇటీవల ఓ మహిళ ఓ పోలీస్ అధికారి పేరును పెట్టింది.

కరోనా వ్యాప్తి సమయంలో పుట్టినందుకు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళ తన కవల పిల్లలకు కరోనా, కొవిడ్‌ అనే పేర్లు కూడా పెట్టిన విషయం తెలిసిందే. భోపాల్‌లోని ఓ దంపతులు తమ శిశువుకు లాక్‌డౌన్‌ అనే పేరు కూడా పెట్టారు.

  • Loading...

More Telugu News