West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వలస కూలీల మృతి

Two dead in Road accident in West Godavari

  • ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఘటన
  • సైకిలుపై ఏలూరు నుంచి తాడేపల్లిగూడేనికి
  • వారి వివరాల కోసం పోలీసుల ఆరా

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు సైకిల్‌పై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బయలుదేరారు.

ఈ క్రమంలో కైకరం వద్ద వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వారి సైకిలును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, కొన ప్రాణంతో వున్న మరో వ్యక్తిని తణుకు ఆసుపత్రికి తరలించగా, అతడు కూడా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వారి వద్ద ఉన్న వస్తువుల ఆధారంగా వలస కూలీలుగా వారిని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

West Godavari District
Road Accident
Andhra Pradesh
  • Loading...

More Telugu News