Chiranjeevi: 'ఆచార్య' సినిమాలో చరణ్ చెల్లెలుగా నిహారిక

Acharya Movie

  • ఉద్వేగభరితంగా సాగే చరణ్ పాత్ర
  •  అన్నాచెల్లెళ్ల మధ్య ఎమోషన్స్
  •  హృదయాలను టచ్ చేసే నిహారిక పాత్ర

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందుతోంది. కొంతవరకూ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర చైతన్య భరితంగా .. ఉద్వేగ పూరితంగా ఉంటుందని అంటున్నారు. ఆయన చెల్లెలి పాత్రలో నిహారిక కనిపించనుందనేది తాజా సమాచారం.

చరణ్ కి, ఆయన చెల్లెలికి మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. బలమైన సిస్టర్ సెంటిమెంట్ వున్న కారణంగానే, నిహారిక అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు కూడా నిహారిక 'సైరా'లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక 'ఆచార్య'లో ఆమె పాత్ర ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi
Kajal Agarwal
Charan
Niharika
  • Loading...

More Telugu News