America: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం మాయం!

One in Six Americans loss jobs

  • అమెరికాలో 1930 మహామాంద్యం నాటి పరిస్థితులు
  • గత వారం నిరుద్యోగ భృతి కోసం 44 లక్షల మంది దరఖాస్తు
  • నిరుద్యోగ రేటు 10 శాతానికిపైగా నమోదయ్యే అవకాశం

కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికాలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది. 1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడినట్టు నిపుణులు చెబుతున్నారు. 1931-40 మధ్య నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.  

2008-09లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం సమయంలో నిరుద్యోగ రేటు 10 శాతం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల వచ్చే ఏడాదికి నిరుద్యోగ రేటు 10 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాదిమంది ఇప్పటికే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత వారంలో 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News