Bhumi Pednekar: త్వరలోనే తెలుగు తెరకి భూమి పడ్నేకర్

Bhumi Pednekar

  • బాలీవుడ్లో మంచి క్రేజ్
  •  సౌత్ సినిమాలపై దృష్టి
  •  తెలుగు తెరను పలకరించే ఛాన్స్  

తెలుగు తెరకి అందమైన కథానాయికలు చాలామందే పరిచయమవుతున్నారు. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా తోడైన కథానాయికలు అగ్రస్థానానికి చేరుకుంటున్నారు. సౌత్ సినిమాల స్థాయి తెలిసిన ఉత్తరాది భామలు చాలామంది ఇక్కడి అవకాశాల పట్ల ఆసక్తిని చూపుతున్నారు. అలాంటివారి జాబితాలో భూమి పెడ్నేకర్ ఒకరిగా కనిపిస్తోంది.

బాలీవుడ్లో కథానాయికగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న భూమి పెడ్నేకర్, సౌత్ సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు చేయడానికి ఆమె ఆసక్తిని కనబరుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'సరైన సమయం .. మంచి కథ చూసుకుని నేను సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడతాను' అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే భూమి పడ్నేకర్ ను చాలామంది తెలుగు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారట. వాళ్లలో ముందుగా ఆమె ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.

Bhumi Pednekar
Actress
Bollywood
  • Loading...

More Telugu News