Allari Naresh: 'నాంది'తో హిట్ కొట్టి తీరతాను: 'అల్లరి' నరేశ్

Nandi Movie

  • విడుదలకి సిద్ధమవుతున్న 'బంగారు బుల్లోడు'
  • 'నాంది' చిత్రంపైనే 'అల్లరి' నరేశ్ ఆశలు
  • వెబ్ సిరీస్ లలో చేయాలనుందన్న 'అల్లరి' నరేశ్  

తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ తనదైన ముద్ర వేశాడు. ఆయన చేసిన 'బంగారు బుల్లోడు' ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. ఇక 'నాంది' చిత్రం ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి వుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. 'నాంది' చిత్రం నా కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా నాకు తప్పకుండా మంచి హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. హీరోగా మళ్లీ నేను బిజీ అవుతాననే నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ రావడం వలన, ఇతర ముఖ్యమైన పాత్రలకు ఎవరూ పిలవడం లేదు. కానీ నాకు నెగెటివ్ కేరక్టర్లు చేయాలని కూడా వుంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలోను నటించడానికి నేను సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చాడు

Allari Naresh
Nandi Movie
Tollywood
  • Loading...

More Telugu News