Pavan kalyan: పవన్ .. క్రిష్ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణి

Krish Movie

  • సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్
  •  మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రెస్
  • క్రిష్ సినిమా చేస్తున్నట్టు చెప్పిన కీరవాణి

తెలుగులోని అగ్రస్థాయి సంగీత దర్శకులలో కీరవాణి ఒకరుగా కనిపిస్తారు. మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా కీరవాణి మంచి పేరు తెచ్చుకున్నారు. పాటకి అందాన్ని .. అనుభూతిని జత చేసి అందించడం ఆయన ప్రత్యేకత. 'బాహుబలి' .. 'బాహుబలి 2' వంటి సినిమాల విజయాల్లో ఆయన పాటల బాణీలు, నేపథ్య సంగీతం కీలకమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న ఆయన, త్వరలో పవన్ సినిమాకి సంగీతాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నాడు. మొఘలాయిల కాలంలో నడిచే ఈ సినిమా, భారీ బడ్జెట్ తో నిర్మితం కానుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకున్నారు. ఆయన కూడా ఈ  విషయాన్ని ధ్రువీకరించారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు.

Pavan kalyan
Krish
Keeravani
  • Loading...

More Telugu News