Hyderabad: మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం!

Gang rape on girl in Hyderabad

  • హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌లో ఘటన
  • బాలికపై నలుగురు యువకుల అత్యాచారం
  • పోలీసుల అదుపులో నిందితులు

మతిస్థిమితం లేని బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో జరిగింది. బాధిత బాలిక రోడామిస్త్రీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన యువకులు అక్బర్, జుమన్, గయాజ్, అలీంలు ఆమెను సమీపంలోని ఓ పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.

దీంతో కంగారుపడిన వారు వెంటనే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు రెండు గంటల తర్వాత దేవేందర్‌నగర్‌లో బాలికను గుర్తించారు. అప్పటికీ ఆమెతోనే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురిని కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
quthbullapur
Girl
Crime News
  • Loading...

More Telugu News