Mamata Banerjee: లాక్ డౌన్ ఎత్తివేత దశల వారీగా జరిగితే బాగుంటుంది: మమతా బెనర్జీ

TMC Leader Mamata Banerji Statement

  • మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలి
  •  ఓ పౌరురాలిగా ఇది నా అభిప్రాయం
  • ప్రధానితో సమావేశంలో ఈ అంశం ప్రస్తావన వస్తే చెబుతా

లాక్ డౌన్ ఎత్తివేత దశలవారీగా జరిగితే బాగుంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా, ఓ పౌరురాలిగా ఇది తన అభిప్రాయమని అన్నారు. ప్రధానితో జరగబోయే సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తే తన మనసులోని మాటను తెలియజేస్తానని అన్నారు. అయితే, కొన్ని పరిమితులకు లోబడి లాక్ డౌన్ ఎత్తివేయాలని విమానాలు, రైళ్లు (దూర ప్రాంతపువి) ని అనుమతించవద్దని సూచించారు. రాష్ట్రంలో ‘కరోనా’ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ తగినన్ని కిట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

Mamata Banerjee
Trinamool congress
Lockdown
  • Loading...

More Telugu News