Harish Shankar: నాటకానికి దర్శకత్వం వహించాలని వుంది: హరీశ్ శంకర్

Harish Shankar

  • మొదటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉండేది
  • కొంతమంది పెద్దలు నన్ను ప్రోత్సహించారు  
  • నాటకాల్లో నటించి అవార్డులు గెలుచుకున్నానన్న హరీశ్

టాలీవుడ్లో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో హరీశ్ శంకర్ ఒకరుగా కనిపిస్తాడు. ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ఆడియన్స్ ను అలరించేలా కథలను సిద్ధం చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్వరలో ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాటకాల గురించి ప్రస్తావించాడు. "స్కూల్ డేస్ నుంచే నాకు నాటకాలపట్ల ఆసక్తి ఉండేది. కోట శ్రీనివాసరావు .. తనికెళ్ల భరణి వంటివారి ప్రేరణతో నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. నాటకానుభవం కలిగిన పెద్దలు నన్ను ప్రోత్సహించారు. కొన్ని నాటకాల్లో నటించినందుకుగాను నాకు రాష్ట్రస్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. ఎప్పటికైనా ఒక మంచి నాటకానికి దర్శకత్వం వహించాలనేది నా కల. ఆ కల నిజం చేసుకోవడానికిగాను నా వంతు కృషి నేను చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.

Harish Shankar
Kota Srinivasa Rao
Thanikella Bharani
  • Loading...

More Telugu News