Pawan Kalyan: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లో ఈ పని తప్పకుండా చేయండి: పవన్ కల్యాణ్

pawan about book reading

  • మానవ జీవితంతో మమేకమైపోయిన పుస్తకం పండుగ నేడు
  • డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం
  • చేతిలో చిల్లి గవ్వలేకపోయినా విజ్ఞాన సంపన్నునిగా మార్చేది పుస్తకం
  • పుస్తక పఠనం తప్పనిసరిగా చేయండి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో పుస్తకాలు చదవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ రోజు బుక్‌డే సందర్భంగా ట్వీట్లు చేశారు. 'మానవ జీవితంతో మమేకమైపోయిన పుస్తకం పండుగ నేడు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా బుక్ డే ను పాఠకులు ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. పుస్తక ప్రియుడిగా నా భావాలను నాలుగు అక్షరాల రూపంలో మీతో  పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నాను' అని చెప్పారు.

'డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం.. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా విజ్ఞాన సంపన్నునిగా మార్చేది పుస్తకం... దోచుకోడానికి అవకాశంలేని సంపదను ఇచ్చేది పుస్తకం. మనలోని అజ్ఞానాన్ని పారదోలేది పుస్తకం... మన మస్తకాన్ని తాజాగా ఉంచేది పుస్తకం' అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

'ఇంతటి మహత్తరమైన శక్తి కలిగిన  పుస్తకాన్ని  మన దిన చర్యలో భాగం చేద్దాం. ప్రస్తుత స్వీయ నిర్బంధన కాలంలో పుస్తక పఠనం తప్పనిసరిగా చేయండి. మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి. పుస్తకాన్ని ప్రేమించండి.. విజ్ఞాన ప్రపంచంలో జీవించండి' అని పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను వందలాది పుస్తకాలు చదువుతున్నట్లు ఫొటోలు తీసుకుని పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News