ప్రభాస్ తో పెళ్లి వార్తలపై స్పందించిన నాగబాబు కుమార్తె నిహారిక!
- ప్రభాస్ తో నిహారిక వివాహం జరగనుందని వార్తలు
- అవన్నీ అవాస్తవమని స్పష్టీకరణ
- వరుణ్ తేజ్ బావే అయినా అన్నయ్యతో సమానమని వ్యాఖ్య
ఇందులో భాగంగా ఓ అభిమాని, "మీరు ప్రభాస్ ను వివాహం చేసుకుంటున్నారా?" అని ప్రశ్నించాడు. దీనికి నీహారిక సమాధానం ఇస్తూ, తాను ప్రభాస్ ను ప్రేమించడం లేదని, పెళ్లి వార్తలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పింది. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించాలని కోరింది. ఇక మరో ప్రశ్నకు సమాధానంగా సాయిధరమ్ తేజ్ తనకు వరసకు బావే అయినప్పటికీ, అన్నయ్యతో సమానమని, తమ కుటుంబంలో తనకు వైష్ణవ్ తేజ్ బాగా దగ్గరని వ్యాఖ్యానించింది.