Be the Real Man: చిరంజీవి వీడియో వచ్చిన వెంటనే... తన వీడియోను పోస్ట్ చేసిన వెంకటేశ్!

Venkatesh Completes Challenge

  • ఇంటిపని, తోటపని, వంటపని చేసిన వెంకటేశ్
  • మహేశ్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలకు చాలెంజ్
  • 'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ లో వెంకటేశ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన 'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి, తన వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేయగా, ఆపై కాసేపటికే విక్టరీ వెంకటేశ్ స్పందించారు. "అందరమూ ఇంటి పనిలో కుటుంబ సభ్యులకు సహాయపడదాం. మా చిన్నోడు మహేశ్ బాబు, నా కోబ్రా వరుణ్ జేజ్, అనిల్ రావిపూడిలకు ఈ చాలెంజ్ ని నేను పాస్ చేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరంజీవి తన చాలెంజ్ ని కేటీఆర్, రజనీకాంత్ లకు ఫార్వార్డ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వీడియోలో, తొలుత ఇంటిని శుభ్రం చేసిన వెంకటేశ్, ఆపై తోటలో పెరిగిన గడ్డిని కోశారు. తోటపని తరువాత, వంటింట్లోకి చేరిపోయి, మిక్సెడ్ వెజిటబుల్ కర్రీ చేశారు. ఆపై 'ఐ యామ్ దట్' పుస్తకాన్ని చదువుతూ స్విమ్మింగ్ పూల్ ముందు సేదదీరుతూ కనిపించారు. వెంకటేశ్ పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.

Be the Real Man
Venkatesh
Challenge
Chiranjeevi
Video
Mahesh Babu
  • Error fetching data: Network response was not ok

More Telugu News