Rajasekhar: తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్ తో సాగే రాజశేఖర్ మూవీ

Veerabhadram Chowdari Movie

  • వీరభద్రం చౌదరి నుంచి మరో సినిమా
  • ఆంగ్ల చిత్రం 'టోకెన్' నుంచి ప్రేరణ
  • తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో నడిచే కథ

'కల్కి' సినిమా తరువాత రాజశేఖర్ కి చాలానే గ్యాప్ వచ్చింది. ముందుగా అనుకున్న ప్రాజెక్టులు చివరి నిమిషంలో సెట్ కాకపోవడంతో గ్యాప్ వచ్చేసింది. కొంతమంది దర్శకుల నుంచి కథలు వింటూ వచ్చిన ఆయన, వీరభద్రం చౌదరికి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది.

గతంలో వచ్చిన ఆంగ్ల చిత్రం 'టోకెన్' నుంచి మెయిన్ పాయింట్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తాయని అంటున్నారు. సెంటిమెంట్ ప్రధానంగా గతంలో రాజశేఖర్ చేసిన సినిమాలు భారీ విజయాలనే అందుకున్నాయి. ఆ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందేమో చూడాలి.

Rajasekhar
Veerabhadram Chowdari
Tollywood
  • Loading...

More Telugu News