Vijay Sai Reddy: విజయసాయీ... మాస్క్ ముక్కుకు పెట్టుకోవాలండీ: నాగబాబు సెటైర్

Nagababu Setire on Vijayasai Reddy Mask
  • ఓ కార్యక్రమంలో మాస్క్ తీసేసి మాట్లాడిన విజయసాయి
  • మాస్క్ గొంతుకు వేసుకునేది కాదు
  • మాస్క్ ఉన్నా జనం గుర్తుపడతారని నాగబాబు సెటైర్
ఇటీవల ఓ కార్యక్రమానికి మాస్క్ ధరించి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, నోటికి ధరించిన మాస్క్ ను తొలగించడంపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "విజయ సాయి రెడ్డి మాస్క్ ముక్కు, నోటికి పెట్టుకోండి. గొంతుకి కాదు. ఒక వేళ మీరు అసిమ్టోమేటిక్ అయినా ప్రాబ్లెమ్ ఉండదు. మీ సెక్యురిటి కూడా మాస్క్ లు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోండి. ఫ్యూచర్ లో ఫైట్ చేసుకోవాలిగా మీతో. మీకు మాస్క్ వున్నా జనం గుర్తు పడతారు. నేను గారంటీ" అని అంటూ విజయసాయి మాస్క్ ను గొంతుకు వేసుకుని మాట్లాడుతున్న చిత్రాన్ని నాగబాబు జోడించారు.
Vijay Sai Reddy
Nagababu
Mask
Twitter

More Telugu News