Chiranjeevi: ఇల్లు శుభ్రం చేసి, కిచెన్ లో దోశ వేసి, అమ్మకు తినిపించి... 'ఓ భీమ్... ఇదే నా వీడియో సాక్ష్యం' అంటున్న చిరంజీవి!

Chiranjeevi Posted Proof Video that he is a Real Man

  • 'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ విసిరిన ఎన్టీఆర్
  • వీడియో ద్వారా సమాధానం ఇచ్చిన చిరంజీవి
  • తాను రోజూ చేసే పనులేనని వెల్లడి
  • కేటీఆర్, రజనీకాంత్ లకు చాలెంజ్ ఫార్వార్డ్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ ని పూర్తిచేసి, చిరంజీవి తదితరులకు ఈ చాలెంజ్ ను విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చిరంజీవి, తాను కూడా చాలెంజ్ ని పూర్తిచేసి, సంబంధిత వీడియోను పోస్ట్ చేస్తూ తాను రోజూ ఈ పనులను చేస్తానని పేర్కొన్నారు.

"ఇదిగో భీమ్... నేను రోజూ చేసే పనులే... ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం. నేను ఇప్పుడు కేటీఆర్, నా స్నేహితుడు రజనీకాంత్ కు 'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ ని విసురుతున్నాను" అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇక ఇందులో తన ఇంటి హాల్ ను వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేసిన చిరంజీవి, ఆపై వంటగదిలో అనుభవం వున్న వాడిలా చకచకా దోశ వేశారు. దాన్ని తీసుకెళ్లి తన తల్లి అంజనాదేవికి తినిపించారు. అంజనాదేవి, ఓ దోశ ముక్కను "నేను తింటాలే... ముందు నువ్వు తిను" అంటూ బిడ్డకు తినిపించారు.

ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం "వకీల్ సాబ్"లోని "మగువా మగువా..." అన్న పాట వినిపిస్తోంది. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News