CCC: కరోనా క్రైసిస్ చారిటీకి సినీ నటుడు గోపీచంద్ రూ. 10 లక్షల విరాళం

Actor Gopichand donates 10 lakh to CCC
  • సీసీసీకి చిత్ర పరిశ్రమ నుంచి అందుతున్న చేయూత
  • ఇప్పటికే 2,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు
  • 1,500 మంది అనాథలకు రెండు నెలలపాటు అన్నదానం
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సినీ పరిశ్రమ నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సీసీసీకి విరాళాలు ఇస్తూ చేతనైనంత సాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో, కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతున్న రెండు వేల కుటుంబాలకు ఇప్పటికే నిత్యావసర సరుకులు అందజేసిన హీరో గోపీచంద్.. 1,500 మంది అనాథలకు రెండు నెలలపాటు అన్నదానం చేస్తున్నాడు. తాజాగా సీసీసీకి రూ. 10 లక్షల విరాళం అందించాడు.
CCC
Chiranjeevi
Gopichand
Tollywood
Corona Virus

More Telugu News