Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య

Software Engineer Family Suicide in Hyderabad

  • మీర్‌పేట పరిధిలోని అల్మాస్‌గూడలో ఘటన
  • రెండు రోజులుగా బయటకు రాని కుటుంబ సభ్యులు
  • ఉరివేసుకున్న నలుగురు కుటుంబ సభ్యులు

హైదరాబాద్ శివారులోని మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మీర్‌పేట పరిధిలోని అల్మాస్‌గూడలో నేటి సాయంత్రం జరిగిందీ ఘటన. మృతుల్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరీశ్, ఆయన కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివసిస్తున్న వీరు గత రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా, ‘ఈ తలుపు తెరవండి ప్లీజ్’ అనే కాగితం అతికించి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు తెరిచి చూడగా కుటుంబ సభ్యులు నలుగురు విగత జీవులుగా కనిపించారు.

మృతులను హరీష్‌, స్వప్న గిరీష్‌, సువర్ణగా గుర్తించారు. వారి ఫోన్ ఆధారంగా పోలీసులు వారి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారంతా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad
Meerpet
Software engineer
suicide
  • Loading...

More Telugu News