Krishna District: కొండపల్లిలో ఆవులకు అంటువ్యాధి.. ప్రజల్లో భయంభయం!

Cows are sick in Konadapalli village Krishna dist
  • ఎర్రటి మచ్చలు, కళ్లలో రక్తంతో గోవులు విలవిల
  • పొంగు జబ్బు వచ్చిందని నిర్ధారణ
  • వారం రోజులపాటు చికిత్స అందించాలన్న వైద్యులు
కృష్ణా జిల్లా కొండపల్లి ప్రజలు భయంతో వణుకుతున్నారు. గ్రామానికి చెందిన ఆవులు వింత వ్యాధితో విలవిల్లాడుతుండడమే ఇందుకు కారణం. శరీరంపై ఎర్రటి మచ్చలతోపాటు కళ్ల నుంచి రక్తం వస్తుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యులు వెంటనే గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన 70 గోవులను పరీక్షించారు. వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్ధారించారు.

ఇది అంటువ్యాధి అని, ఒకదాన్నుంచి మరోదానికి ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ జబ్బు శరీరం నుంచి కడుపులోకి పాకితే ప్రమాదమని చెప్పారు. వీటికి వారం రోజులపాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, కరోనా నేపథ్యంలో వాటికి అది సోకిందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అలాంటిదేమీ ఉండదని, కరోనా వైరస్ జంతువులకు సోకదని అధికారులు వివరించి చెప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
Krishna District
Kondapalli
Cows

More Telugu News