Amit Shah: అమిత్ షా భరోసాతో నిరసనను విరమించుకున్న డాక్టర్లు

Doctors withdraws protest after Amit Shah assurance
  • డాక్టర్లపై కరోనా బాధితుల దాడులు
  • రేపు బ్లాక్ డే నిర్వహించేందుకు సిద్ధమైన వైద్యులు
  • డాక్టర్లకు  అన్ని విధాలా భద్రతను కల్పిస్తామన్న  అమిత్ షా
విపత్కర సమయంలో వైద్యులు సేవలను అందిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి అన్ని విధాలా భద్రతను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తో కలిసి దేశంలోని ప్రముఖ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైద్యులకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని చెప్పారు. వైద్యులు నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విన్నవించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు నిరసన చేపడితే సమాజంలోకి చెడు సందేశం వెళ్తుందని చెప్పారు.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దేశంలోని పలుచోట్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అద్దె ఇళ్లలో ఉంటున్న డాక్టర్లను ఇంటి యజమానులు వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు బ్లాక్ డేను నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా భరోసా ఇవ్వడంతో వైద్యులు శాంతించారు.
Amit Shah
BJP
Doctors
Protest

More Telugu News