Narendra Modi: లాక్‌డౌన్‌పై మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ కీలక భేటీ

central cabinet meet

  • కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ ప్రభావంపై చర్చలు
  • దేశ ఆర్థిక స్థితి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు
  • ఉద్యోగులకు డీఏ పెంపు నిలుపుదలపై కూడా చర్చ

కరోనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమయింది. దేశంలో కరోనా విజృంభణ తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులను ప్రకటించింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కేబినెట్‌లో కీలక చర్చలు జరుపుతున్నారు.
 
కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ ప్రభావం, దేశ ఆర్థిక స్థితి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మోదీకి కేంద్ర మంత్రులు సూచనలు చేస్తున్నారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన డీఏ పెంపును కొన్నాళ్లు నిలుపుదల చేసే విషయంపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీపై కూడా మోదీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ భేటీకి ముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఇందులో పలు ప్రతిపాదనలు చేసింది.. వాటిని ప్రధాని మోదీకి వివరిస్తోంది.

  • Loading...

More Telugu News