Balakrishna: కాశీ ఎపిసోడ్ గురించి ఆలోచనలో పడిన బోయపాటి

Boyapati Movie

  • కాశీ నేపథ్యంలో సాగే కథాకథనాలు  
  • ఇప్పట్లో అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేదు
  • కథ మార్చడం కుదరకపోవడంతో టెన్షన్  

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాలో ఒక కీలకమైన ఎపిపోడ్ అంతా కాశీ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ అనుమతులు తీసుకోవడం .. అడ్వాన్సులు చెల్లించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.

అయితే కరోనా .. లాక్ డౌన్ కారణంగా మరో మూడు నాలుగు నెలల వరకూ కాశీలో షూటింగు చేసే అవకాశాలు ఉండక పోవచ్చనే సంకేతాలు వస్తున్నాయట. అప్పటి వరకూ షూటింగును ఆపుకుంటే ప్రాజెక్టు చాలా లేట్ అవుతుంది. పోనీ కథలో మార్పులు చేద్దామా అంటే, వారణాసి ఎపిసోడ్ తోనే మిగతా కథ ముడిపడి ఉంటుందట. అందువలన ఏం చేయాలో పాలుపోక బోయపాటి ఆలోచనలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో బోయపాటి కొత్త కథానాయికను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.

Balakrishna
Boyapati Sreenu
Tollywood
  • Loading...

More Telugu News