Rana: 'హిరణ్య కశిప' విషయంలో ఆలోచనలో పడిన సురేశ్ బాబు

Hiranya Kashipa Movie

  • చిత్ర పరిశ్రమపై లాక్ డౌన్ ఎఫెక్ట్
  • నష్టాలు భరిస్తున్న సురేశ్ బాబు
  • 'హిరణ్య కశిప' ప్రాజెక్టు ఆలస్యం  

రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశిప' సినిమాను సురేశ్ బాబు ప్లాన్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొంతకాలంగా జరుగుతూనే వున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను రూపొందించే దిశగానే పనులు జరుగుతూ వస్తున్నాయి.

భారీ సెట్స్ ఖర్చును కలుపుకుని 180 కోట్లలో ఈ సినిమా చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ప్రభావం మిగతా రంగాలపై మాదిరిగానే చిత్రపరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడటం వలన ఇప్పటికే సురేశ్ బాబు పెద్ద మొత్తంలో నష్టపోయారట. ఇప్పట్లో జనాలు థియేటర్స్ కి వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అందువలన 'హిరణ్య కశిప' ప్రాజెక్టును కొంతకాలం పాటు పక్కన పెట్టేయాలనే నిర్ణయానికి సురేశ్ బాబు వచ్చారని అంటున్నారు. ఈ లోగా గుణ శేఖర్ మరో కథను లైన్లో పెడతారేమో చూడాలి.

Rana
Gunasekhar
Suresh Babu
  • Loading...

More Telugu News