Corona Virus: లాక్ డౌన్ సడలిస్తే కరోనా స్వైర విహారమే... తాజా అధ్యయనం!

Carona Cases May Go High If Lockdown Eases
  • మూడు గణాంక విశ్లేషణా పద్ధతుల్లో లెక్కలు 
  • మే 3 నాటికి 54,230 పాజిటివ్ కేసులు రావచ్చు
  • 14 నాటికి 2 లక్షలకు పైబడనున్న పాజిటివ్ లు
ఇండియాలో లాక్ డౌన్ 2.0 డెడ్ లైన్ అయిన మే 3 నాటికి దేశవ్యాప్తంగా 54,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని, ఆపై లాక్ డౌన్ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తే, వైరస్ స్వైర విహారం చేస్తుందని ఓ ఆంగ్ల వార్తా చానెల్ చేసిన అధ్యయన నివేదిక హెచ్చరించింది. లాక్ డౌన్ ముగిసే సమయానికి కేసుల సంఖ్య ఏ మేరకు పెరగవచ్చన్న విషయమై అంచనా వేసేందుకు ఎస్ఈఐఆర్ ( ససెప్టిబుల్‌, ఎక్స్‌పోజ్డ్‌, ఇన్ఫెక్టెడ్‌, రెసిస్టంట్), పాలీ నోమియల్ రిగ్రెషన్ రకానికి చెందిన రెండు గణాంక విశ్లేషణా పద్ధతులను వినియోగించి లెక్కలు కట్టారు.

ఇక, ఈ అంచనాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ నిత్యమూ విడుదల చేస్తున్న బులెటిన్ ల సమాచారాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకున్నారు. ఎస్ఈఐఆర్ నమూనాలో మే 3 నాటికి 54,230 కేసులు నమోదవుతాయని తేలింది. మిగతా రెండు పద్ధతుల్లో వచ్చిన కేసుల సంఖ్యలతో సగటు తీసినా, 38,534 కేసులు ఖాయమని అధ్యయనం వెల్లడించింది.

ఇక ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు ఇచ్చిన మినహాయింపులు కూడా కేసుల సంఖ్యను పెంచనున్నాయని, మే 3 నుంచి లాక్ డౌన్ తొలగిస్తే, 14వ తేదీ నాటికి కేసుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరుగుతుందని ఎస్ఈఐఆర్ నమూనా పేర్కొంది. మిగతా రెండు నమూనాల్లో 26,442, 34,095గా కేసులు ఉండవచ్చని వెల్లడైంది. ఇక, లాక్ డౌన్ లో ప్రజలు నిబంధనలను పాటిస్తున్న తీరు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి రేటుపై కేసుల పెరుగుదల ఆధారపడుతుందని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితి కూడా కేసుల సంఖ్యను ప్రభావితం చేస్తుందని అధ్యయనం పేర్కొంది.
Corona Virus
New Cases
Lockdown
India

More Telugu News