Donald Trump: కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్య వార్తలపై స్పందించిన ట్రంప్!

Trump Comments on Kim Jong Un Health Condition

  • కిమ్ తో నాకు సత్సంబంధాలే ఉన్నాయి
  • ఆయన బాగుండాలని కోరుకుంటున్నా
  • వస్తున్న రిపోర్టులు నిజమో, కాదో తెలియదన్న ట్రంప్

గుండెకు శస్త్రచికిత్స అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వచ్చిన వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో కిమ్ ను గుర్తు చేసుకున్న ట్రంప్, "ప్రస్తుతానికి నేను ఒక్కటే చెప్పగలను. ఆయన బాగుండాలి. అతనితో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వస్తున్న వార్తల ప్రకారమైతే, ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా విషమించినట్టేనని భావించాలి" అని అన్నారు.

ఇక కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం ఏమైనా లభించిందా? అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానాన్ని ఇవ్వలేదు. వస్తున్న వార్తలు నిజమో, కావో కూడా తనకు తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, జూన్ 2018లో సింగపూర్ లో, ఆపై 2019లో వియత్నాంలో డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ లు సమావేశమై, ఇరు దేశాల మధ్యా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

Donald Trump
Kim Jong Un
Health Condition
North Korea
  • Loading...

More Telugu News