konidela niharika: గ్లామర్ పాత్రల్లో నటించేందుకు సిద్ధం: నిహారిక

I am open to do glam roles says Niharika Konidela

  • నా తదుపరి చిత్రం షూటింగ్ గోవా బీచ్‌లలో ఉంటుంది
  • పెళ్లయ్యాక సినిమాలు చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను
  • యాంకర్ రవితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో వెల్లడి

మెగా వారసురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక ఇకపై వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. ఇప్పటిదాకా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకున్న యువ నటి.. ఇకపై గ్లామర్ పాత్రలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపింది. యాంకర్ రవితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘నీళ్ల లోతు ఎంతుందో చూడాలంటే రెండు వేళ్లు ముంచితే సరిపోదు. మెడ వరకు దిగాల్సిందే. ఇప్పటి నుంచి నేను అదే పని చేయబోతున్నా. నేను సమంతను కాదు కాబట్టి పెళ్లి తర్వాత సినిమాలు చేస్తానో లేనో ఇప్పుడే చెప్పలేను. నాకు ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నా’ అని చెప్పింది.

లాక్‌డౌన్ తర్వాత పలు చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు సంతకం చేయాలని నిహారిక భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, గ్లామర్ రోల్స్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నానని మెగా వారసురాలు తెలిపింది. ‘వాటికి నేను సిద్ధమే. ఒకరకంగా నా తదుపరి తమిళ చిత్రం  ఓ రొమాంటింక్ సినిమా. దాన్ని గోవాలో చిత్రీకరిస్తారు. అందువల్ల అక్కడి బీచ్‌లలో రొమాంటిక్ సన్నివేశాలు తీస్తారు’ అని చెప్పుకొచ్చింది.

konidela niharika
open to
glam roles
Tollywood
  • Loading...

More Telugu News