Balakrishna: నాతో సినిమా చేయవద్దని చాలామంది చెప్పినా బాలయ్య వినిపించుకోలేదు: పూరి

puri Jagannadh Movie

  • బాలకృష్ణగారు ముక్కుసూటి మనిషి
  • ఆయన ఏ విషయాన్నీ మనసులో దాచుకోరు
  • చెప్పుడు మాటలు వినిపించుకోరన్న పూరి

మాస్ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుల జాబితాలో పూరి పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఇక మాస్ ఇమేజ్ వున్న బాలకృష్ణతో కొంతకాలం క్రితం ఆయన 'పైసా వసూల్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఆయన బాలకృష్ణను చాలా స్టైలీష్ గా చూపించారు.

తాజా ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ.. "బాలకృష్ణగారికి నేను 'పైసా వసూల్' కథను 10 నిమిషాల పాటు చెప్పగానే ఆయన ఓకే అనేశారు. కేరక్టర్ పేరు 'తేడా సింగ్' అని చెప్పినప్పటికీ అభ్యంతర పెట్టలేదు. ఇక నాతో సినిమా చేయవద్దని ఆయనకి చాలామంది చెప్పారు. అయినా ఆయన వినిపించుకోలేదు. బాలకృష్ణ అంటే ఏమిటన్నది నాకు అప్పుడే తెలిసింది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఎంతో ఎనర్జీతో వుంటారు. బాలకృష్ణగారు ముక్కుసూటి మనిషి .. ఆయన ఏ విషయాన్నీ మనసులో దాచుకోరు. ప్రేమ .. కోపం రెండూ వెంటనే చూపించేయడం ఆయనకు అలవాటు" అని చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందన్న సంగతి తెలిసిందే.

Balakrishna
Puri Jagannadh
Paisa Vasool Movie
  • Loading...

More Telugu News