Pune: పూణెలో రోడ్లపైకి భారీగా జనం... నడిరోడ్డుపైనే వినూత్న శిక్ష... వీడియో ఇదిగో!

People Made to Sit Ups in Pune

  • నిబంధనలు అతిక్రమించిన ప్రజలు
  • రోడ్డుపైనే గుంజీలు తీయించిన పోలీసులు
  • వైరల్ అవుతున్న వీడియో

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఎవరూ వీధుల్లోకి రావద్దని ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా చెబుతున్నా వినకుండా బయటకు వచ్చిన ప్రజలకు వినూత్న శిక్ష విధించారు పూణె పోలీసులు. భౌతిక దూరాన్ని పాటించడమే కరోనాకు విరుగుడని ఎంతగా చెప్పినా వినకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని ఆడా, మగా అన్న తేడా లేకుండా నడిరోడ్డుపైనే నిలబెట్టి గుంజీలు తీయించారు.

అలాగే, గుంజీలు తీయించే సమయంలో వారు భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్త వహించారు. ఈ ఘటన నగర పరిధిలోని సింఘాడ్ రోడ్డులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News