Gujarath: గుజరాత్ సీఎంకు ఫోన్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్!

YS Jagan Phone to Gujarat CM

  • గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు
  • వారిని ఆదుకోవాలని విజయ్ రూపానీకి విజ్ఞప్తి
  • అన్ని విధాలా ఆదుకుంటామని రూపానీ హామీ

పొట్టకూటి కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్ డౌన్ కారణంగా చిక్కుబడిపోయి, అన్నపానీయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీ మత్స్య కారులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఫోన్ చేసిన జగన్, అక్కడి తెలుగు మత్స్యకారుల ప్రస్తావన తెచ్చారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

 "గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన సీఎం వైయస్‌ జగన్. సానుకూలంగా స్పందించిన సీఎం రూపానీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ" అని ట్వీట్ పెట్టింది.

Gujarath
Jagan
Fisherman
Vijay Rupani
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News