Pavan kalyan: 'బద్రి' రిలీజ్ రోజున పూరి డీలాపడిపోయాడు: రఘు కుంచె

Badri Movie

  • సంధ్య థియేటర్లో 'బద్రి' చూశాము
  • తొలి రోజున పెద్దగా లేని రెస్పాన్స్
  •  రెండో రోజున హిట్ టాక్ వచ్చిందన్న రఘు కుంచె

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా చేసిన 'బద్రి' ప్రేక్షకుల ముందుకు వచ్చి నిన్నటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ రోజును గురించి పూరి స్నేహితుడైన రఘు కుంచె జ్ఞాపకం చేసుకున్నాడు. 'బద్రి' రిలీజ్ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి మార్నింగ్ షోకి వెళ్లాము. అక్కడ పవన్ అభిమానుల హడావిడి చూసి హ్యాపీగా ఫీలయ్యాం.

ఇక సినిమా పూర్తయ్యేటప్పటికి మొత్తం వాతావరణమే మారిపోయింది. సినిమా పోయిందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారనీ, నిర్మాత త్రివిక్రమరావు ఫోన్ కూడా తీయడం లేదని పూరి డీలాపడిపోయాడు. అయితే, ఆ మరుసటి రోజు ఒక్కసారిగా సినిమాకి ఆదరణ పెరిగిపోయింది .. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. చిరంజీవి .. పవన్ నుంచి పూరికి అభినందనలు వచ్చాయి. నిర్మాత త్రివిక్రమరావు నేరుగా వచ్చి పూరిని హత్తుకున్నాడు. అప్పుడు పూరి చిన్నపిల్లాడిలా గెంతులు వేయడం ఇప్పటికీ నాకు గుర్తు వుంది" అని చెప్పుకొచ్చాడు.

Pavan kalyan
Renu Desai
Puri Jagannadh
  • Loading...

More Telugu News