Junior NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఇంటిని ఎలా శుభ్రం చేశాడో చూడండి!

jr ntr at home

  • 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్‌
  • ఇంటి ముందు చెత్త ఊడ్చిన హీరో
  • బాలా బాబాయి, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌కి ఛాలెంజ్ అంటూ ట్వీట్

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ తన ఇల్లు శుభ్రం చేసి ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దర్శకుడు వంగా సందీప్ విసిరిన 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ స్వీకరించిన దర్శకుడు రాజమౌళి ఇంటిని శుభ్రం చేసి తారక్, రామ్ చరణ్‌లకు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో ఈ సవాలును స్వీకరించిన ఎన్టీఆర్‌ తన ఇంట్లో అంట్లు శుభ్రం చేస్తూ, ఇంటి ముందున్న చెత్తను ఊడ్చేశాడు.

ఇదిగో సవాలు స్వీకరించాను జక్కన్న రాజమౌళి అంటూ తారక్ ట్వీట్ చేశాడు. 'మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. వర్క్‌ లోడ్‌ను షేర్‌ చేసుకోవడం ఫన్‌గా ఉంటుంది' అని పేర్కొన్నాడు. 'బాలా బాబాయి, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేశ్ గారు, కొరటాల శివగారుకి ఈ సవాలు విసురుతున్నాను' అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగులు రద్దు కావడంతో ఇంట్లోనే ఉంటున్న సినీనటులు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. ఇంట్లో వారికి సాయం చేస్తూ ఇటువంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

Junior NTR
Corona Virus
Twitter
Lockdown
  • Error fetching data: Network response was not ok

More Telugu News