Hyderabad: బంజారా హిల్స్ లో చక్కర్లు కొట్టిన చిరుత.. వీడియో ఇదిగో!

Leapord found near KBR park Hyderabad
  • కేబీఆర్ పార్క్ వద్ద చిరుత సంచారం
  • రోడ్ నంబర్ 12ను దాటిన చిరుత
  • అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటుచేసుకున్న ఘటన
లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నిర్మానుష్యంగా మారింది. పగటి వేళల్లో కొంత జనసంచారం ఉన్నప్పటికీ... రాత్రి సమయాల్లో మాత్రం రోడ్లపై ఏ ఒక్కరూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, జంతువులు, పక్షులు రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు ఆనుకుని ఉన్న కేబీఆర్ పార్కు వద్ద ఇటీవలే నెమళ్లు బయటకు వచ్చి కనువిందు చేశాయి. తాజాగా ఓ చిరుత ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వద్ద ఉన్న రోడ్ నంబర్ 12 ను దాటుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hyderabad
KBR Part
Banjara Hills
Road no 12
Leapord

More Telugu News