Varla Ramaiah: విజయసాయిరెడ్డి కరోనాకు అతీతుడా?...నేషనల్ పెర్మిట్ లారీ లాగ తిరుగుతున్నాడు: వర్ల రామయ్య

Cant Vijayasai Reddy sent to quaratine asks Varla Ramaiah

  • యూపీ సీఎం ఆయన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లలేదు 
  • విజయసాయిని క్వారంటైన్ కు పంపక్కర్లేదా? 
  • ఇది మీ ప్రభుత్వం చేస్తున్న తప్పు కాదా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా వైరస్ కు అతీతుడా? అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. 14 రోజులు క్వారంటైన్ కు వెళ్లాల్సి వస్తుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఏ2 విజయసాయిరెడ్డి నేషనల్ పర్మిట్ మాదిరి రాష్ట్రాలన్నీ కలియ తిరుగుతున్నాడని... ఆయనను క్వారంటైన్ కు పంపక్కర్లేదా? అని ప్రశ్నించారు. కరోనాకు విజయసాయి అతీతుడా? అని నిలదీశారు. ఇది మీ ప్రభుత్వం చేస్తున్న తప్పు కాదా? అని పశ్నించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News