Russia: మాస్కోపై కరోనా పంజా.. అంతకంతకు పెరిగిపోతున్న కేసులు!

Coronavirus Cases raised in Russia

  • దేశంలో ఒక్కసారిగా అదుపుతప్పిన పరిస్థితి
  • దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో సగం మాస్కోలోనే
  • అధ్యక్షుడు పుతిన్‌పై విమర్శలు

చూస్తుంటే రష్యాలో పరిస్థితి అదుపు తప్పుతున్నట్టే కనిపిస్తోంది. గత రెండు రోజుల్లో 10 వేలకు పైగా కేసులు నమోదు కావడమే ఈ ఆందోళనకు కారణం. గత 48 గంటల్లో ఇక్కడ 10,328 కేసులు నమోదు కాగా, అందులో సగానికిపైగా కేసులు అంటే 5,596 రాజధాని మాస్కోలోనే నమోదు కావడం గమనార్హం.

ఇక తాజా కేసులను కూడా కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 47,121కి పెరగ్గా, 405 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల్లోనూ సగం మాస్కోలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు 26,350 కేసులు నమోదయ్యాయి. 204 మంది మరణించారు. తాజా పరిస్థితులు చూస్తుంటే మాస్కో మరో న్యూయార్క్‌లా మారే అవకాశం ఉందని భయపడుతున్నారు.

నిజానికి కరోనా కట్టడిలో రష్యా తొలుత తీసుకున్న చర్యలు అద్భుత ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో నిన్నమొన్నటి వరకు అక్కడ కేసులు, మరణాలు చాలా స్వల్పంగా నమోదయ్యాయి. అయితే, లాక్‌డౌన్‌ విధింపు ఆలస్యం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దీనికి తోడు క్వారంటైన్ చేస్తే దానిని పట్టించుకోకుండా కొందరు యథేచ్ఛగా రోడ్లపై తిరగడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అధ్యక్షుడు పుతిన్ కరోనా కట్టడి విషయంలో సరిగ్గా స్పందించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

Russia
Corona Virus
putin
Moscow
  • Loading...

More Telugu News